Istalapuram village
Tuesday, 2023-Feb-21
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర..
ఈరోజు 21-02-2023 మంగళవారము 13 వ రోజు నెమ్మికల్, కొత్త తండా, బోరింగ్ తండా, ఇస్తాల్లపురం గ్రామాలలో 12 కిలోమీటర్లు కొనసాగింది..!!
13వ రోజు 169 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు
ఇస్తాలపురం గ్రామంలో పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి రమేష్ రెడ్డి ప్రసంగించారు..!!
విద్యార్థుల బలిదానాలకు చలించిన సోనియా గాంధీ ప్రసాదించిన తెలంగాణ లో, మాయ మాటలతో, బంగారు తెలంగాణ పేరుతో KCR అధికారంలోకి వచ్చాడు..!!
బంగారు తెలంగాణ ను ముద్దాడుతాను అని ప్రగల్బాలు పలికిన KCR, గత 9 సంవత్సరాలుగా తన ఫామ్ హౌస్ లో ఫుల్ బాటిల్ ను ముద్దాడి, గోడలు పట్టుకొని నడుస్తున్నాడు..!!
పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని, బిడ్డ అల్లుడు వస్తే పడుకోవడానికి గది ఏది, స్నానం చేయడానికి బాత్రూం ఏది, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు బర్రెను, గొర్రెను ఎక్కడ కట్టివేయాలి అని ఎద్దేవా చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు..!!
కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాము. ఏ గ్రామంలో మీరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు ప్రజలకు చెప్పాలి..!!
బంగారు తెలంగాణ పేరుతో అక్కడ కేసీఆర్ కుటుంబం ఇక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబాలు మాత్రమే బంగారు కుటుంబాలు అయినవి తప్ప పేదల బ్రతుకులు అలాగే ఉన్నవి..!!
తెలంగాణ ఏర్పడితే రైతులు, మహిళలు, యువకుల, పేద ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆశించాం..!!
వ్యవసాయానికి 24 గంటల కరెంటు అంటున్నాడు. గ్రామాలలో పరిస్థితి చూస్తే 9 గంటలు కూడా సరఫరా చేయడం లేదు.
రైతులు పండించిన పంటలు కొనే దిక్కులేదు, గిట్టుబాటు ధర లభించడం లేదు..!!
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో IKP సెంటర్లలో మహిళా సంఘాల ద్వారా దాన్యం సేకరణ చేసి గిట్టుబాటు ధర చెల్లించే వాళ్ళము..!!
వరి వేస్తే ఉరి అంటున్న ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వ మా..?
రైతులకు రుణమాఫీ వాగ్దానాన్ని ఇంతవరకు నిలబెట్టుకోలేదు..!!
ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు..!!
ప్రజలు నిజాలను గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అతని తొత్తు మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కట్ట కట్టి చెరువులో వేయండి అని రమేష్ రెడ్డి ప్రజలను కోరారు..!!
ఈరోజు రాత్రి ఇస్తాళ్లపురంలో బస చేసి, తిరిగి రేపు ఉదయం పాదయాత్ర కొనసాగించనున్న రమేష్ రెడ్డి బృందము..!!