Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

suryapet

Monday, 2022-Nov-28

# 8వ రోజు 85 కిలోమీటర్ల చేరుకున్న పాదయాత్ర | Patelrameshreddy | Jaicongress | 85km | Suryapet #

బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన సీఎం కెసిఆర్=======*

నిరుద్యోగ భృతి ఎన్నికల హామీకే పరిమితమైంది*========


 15 రోజుల్లో పూడికతీత పనులు చేపట్టకపోతే సొంత నిధులతో దగ్గరుండి నేనే తీపిస్తా*=========

*8వ రోజు చేరిన కాంగ్రెస్ పార్టీ వార్డు వాడికి పాదయాత్ర *========

85 కిలోమీటర్ల చేరుకున్న పాదయాత్ర*

 సూర్యాపేట టౌన్== బంగారు తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చాడని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 20, 36 వార్డులలో వార్డు వార్డుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 9 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏ వార్డులో కూడా సిసి రోడ్డు, సైడ్ కాలువల నిర్మాణం, నాలాల నిర్మాణం, దోమలకు మందు కొట్టడం, వంటి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. కాలువలు సరిగా లేక మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుందని దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నారని , కనీసం కాసేపు ఊపిరి పిలుసుకొనే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు .ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పాలనలో జాతీయస్థాయిలో గుర్తింపు రాగా నేను టిఆర్ఎస్ పాలనలో చెత్త మున్సిపాలిటీగా మారిందని విమర్శించారు. పేదలకు ఏ ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని కేవలం 192 మాత్రమే ఇచ్చి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని మండిపడ్డారు. 15 రోజుల్లో సూర్యాపేట పట్టణంలో మురుగు కాలనీ తీయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నా సొంత నిధులతో లక్షల ఖర్చు అయిన సరే మురుగు కాలువలు తీస్తానని హామీ ఇచ్చారు .ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా  వార్డులో నుండి గెలిచి ఈ వార్డులో ఎక్కడ అభివృద్ధి చేశారొ ప్రజలకు తెలపాలని సవాల్ విసిరారు. ఎక్కడ పనులు అక్కడే సగం లోని ఆగిపోయాయని కనీసం వార్డులను ఉన్న ప్రజల మధ్యకు మంత్రి గాని స్థానిక కౌన్సిలర్లు గాని నాయకులు గాని వచ్చే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు