Chivvemla village
Sunday, 2023-Mar-12
12-03-2023 ఆదివారం
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి చేపట్టిన మహా పాదయాత్ర..
ఈరోజు 24వ రోజున 12 కిలోమీటర్లు నడిచి 315 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు
పాదయాత్ర కు చివ్వేంల గ్రామంలో హాజరైన ప్రజలను ఉద్దేశించి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ..
నా రాజకీయ ప్రస్థానం సర్పంచ్ గా ప్రారంభమై, మీ ఆదరాభిమానాలతో ఎంపీటీసీ గా, జడ్పిటిసి గా, ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాను..!!
గ్రామీణ వాతావరణం లో పేద ప్రజల కష్ట నష్టాలు చూస్తూ పెరిగిన వాడిని..!!
ఈరోజు ఉదయం మోదీని పురం నుండి పాదయాత్ర ప్రారంభించి మారుమూలన ఉన్న పలుతండాలు సంగోని తండా, పాడ్య నాయక్ తండా , బొక్కల తండా,రాజ్ తండా, కస్నా తండాలు అభివృద్ధి మా హయాంలోనే జరిగింది..!!
గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయి..!!
లంబాడాల కు రిజర్వేషన్లు ఇందిరాగాంధీ హయాంలో కల్పించబడ్డాయి..!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత 9 సంవత్సరాల BRS పాలనలో గిరిజనులకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు..!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెరిగిన గిరిజన జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాల్సిన ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదు..!!
గిరిజన తండా లను ప్రత్యేక గ్రామపంచాయతీలు గా ఏర్పరిచిన KCR, నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని విస్మరించాడు..!!
గిరిజనులకు మూడు ఎకరాల భూమి కేటాయింపు ఎక్కడ జరగలేదు..!!
మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ప్రకటించిన గిరిజన బంధు పథకం ఏమైందని ప్రశ్నిస్తున్నాము..!!
పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేసింది..!!
ప్రస్తుతం ఎన్నికల సమయం కానప్పటికీ, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామని చెప్పారు..!!
ఈ రాత్రికి చివ్వేంల గ్రామం లో బస చేసి, తిరిగి రేపు ఉదయం మహా పాదయాత్ర కొనసాగించనున్న పటేల్ రమేష్ రెడ్డి బృందం..!!