Thursday, 2023-Mar-16
భారత్ జోడో స్ఫూర్తితో హాత్ సే హాత్ జోడో అభియాన్ మహా పాదయాత్రలో భాగంగా...
16-03-2023గురువారం
కేంద్రంలోని మతతత్వ బిజెపి ప్రభుత్వ, విభజించి పాలించు సిద్ధాంతానికి వ్యతిరేకంగా..
శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో..
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర గుంపుల నుండి యాత్ర ప్రారంభించి తిరుమలగిరి వరకు చేరుకుంది 28వ రోజు 345 కిలోమీటర్లు దిగ్విజయంగా కొనసాగుతున్నది..!!
సూర్యాపేట నియోజకవర్గంలో మనం గెలిపించిన జగదీశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రికి సన్నిహిత మంత్రిగా వ్యవహరిస్తూ ఏనాడైనా గ్రామాలకు వచ్చాడా అని ప్రశ్నిస్తున్నాం..!!
తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని ఆశించాము..!!
చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయా, ఏ ఊరిలో నైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించారా, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందించారా అని ఆలోచించండి..!!
దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు మీ గ్రామంలో ఒకరికైనా ఇచ్చారా..!!
దళిత బంధు పేరిట ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అని హామీ ఇచ్చారు. దానిని ఎంతవరకు నెరవేర్చారు అనే అంశాలను ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను..!!
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కాలనీ పేరుతో వందల ఇండ్లు కట్టించింది..!!
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు.
మీ ఊరిలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా అని నిలదీస్తున్నాము..!!
నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర తో, గ్రామాల లోని మీ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు అనే ఆలోచనతో మేము ఈ పాదయాత్ర చేస్తున్నాము..!!
సూర్యాపేట నియోజకవర్గంలో... తిష్ట వేసిన సమస్యలు అన్నింటినీ పరిష్కరించే వరకు, కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని రమేష్ రెడ్డి గారు భరోసా గా చెప్పారు..!!