గార కుంట, పెద్ద గార కుంట తండా, ఎల్లపు కుంట తండా, న్యూ బంజారా హిల్స్ తండా లలో బ్రహ్మాండమైన ప్రజాస్పందనతో కొనసాగింది
Tuesday, 2023-Mar-28
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి కొనసాగిస్తున్న పాదయాత్ర..
28-03-2023 నాడు 37వ రోజు ఈరోజు ఉదయం పెన్ పహాడ్ మండలంలోని పెద్ద సీతారాం తండా నుండి యాత్ర ప్రారంభించి చిన్న గార కుంట, పెద్ద గార కుంట తండా, ఎల్లపు కుంట తండా, న్యూ బంజారా హిల్స్ తండా లలో బ్రహ్మాండమైన ప్రజాస్పందనతో కొనసాగింది..!!
37వ రోజున 9 కిలోమీటర్లు నడిచి 456 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది
పాదయాత్రకు అధిక సంఖ్యలో హాజరైన గిరిజనులను ఉద్దేశించి రమేష్ రెడ్డి ప్రసంగించారు..!!
ఈ ప్రాంతంలో ఉన్న పది తండా లలో సాగు, తాగునీరు సమస్యకు ప్రధాన కారణం అసమర్ధ మంత్రి జగదీశ్వర్ రెడ్డి..!!
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో SRSP కాలవల ద్వారా నియోజకవర్గంలోని 90% భూములకు నీరు అందింది..!!
ఈ ప్రాంతపు తండా లలో నీటి ఎద్దడికి కారణం, కాంగ్రెస్ ప్రభుత్వ అనంతర BRS ప్రభుత్వ అసమర్ధతే కారణం..!!
టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు మూడి రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ ప్రాంత తండాలలో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో విద్యా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం..!!
సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి కార్పొరేట్ ఆస్పత్రి స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం..!!
గిరిజన తండా లలో పక్కా గృహాలు, రేషన్ కార్డు, పెన్షన్లు, చదువుకున్న తమ్ముళ్లు చెల్లెళ్లకు ఉద్యోగాల కల్పనకు బాధ్యత వహిస్తాను..!!
అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ను, రమేష్ రెడ్డి ని కలవ వద్దని బెదిరింపులకు పాల్పడితే సహించమని హెచ్చరిస్తున్నాం..!!
అధికార మదంతో టిఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తే వడ్డీకి వడ్డీ చెల్లిస్తాం..!!
భూ కబ్జాలు, భూమాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా గా అధికార పార్టీ నాయకులు తయారయ్యారు..!!
రానున్న ఎన్నికలలో సూర్యాపేట నుండి...
తట్ట బుట్ట సర్దుకుని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి కి ప్రయాణమయ్యే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నాము..!!
ఈరోజు రాత్రి తండా లో బస చేసి తిరిగి రేపు ఉదయం పాదయాత్ర కొనసాగనించనున్న రమేష్ రెడ్డి బృందం..!!