Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Anajipuram village

Saturday, 2023-Apr-01

పెన్ పహాడ్ మండలంలోని అనాజిపురం గ్రామంలో పాదయాత్ర

భారత్ జోడో స్ఫూర్తితో హాత్ సే హాత్ జోడో అభియాన్ మహా పాదయాత్రలో భాగంగా...
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు కొనసాగిస్తున్న పాదయాత్ర..
ఈ రోజు 01-04-2023 నాడు,
బ్రిడ్జ్ అన్నారం నుండి ప్రారంభించి నారాయణ గూడెం, నాగుల పహాడ్, దుబ్బగూడెం, దోసపహాడ్ అనాజీపురం గ్రామంకు చేరింది..!!
40వ రోజున 15 కిలోమీటర్లు నడిచి 494 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది 
అనాజీపురం గ్రామంలో పాదయాత్రకు హాజరైన  ప్రజలను ఉద్దేశించి పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడారు..!!
గత 25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా ఈ గ్రామ ప్రజల ప్రోత్సాహం ఉన్నది..!!
దేశ ఐక్యత కోసం శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టారు..!!
రాహుల్ గాంధీ గారి పాదయాత్ర స్ఫూర్తితో.. 
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సైతం గ్రామాలలో, ప్రజలతో అడుగడుగునా మమేకమై మీ కష్టాలను తెలుసుకోవాలని ఈ పాదయాత్ర చేస్తున్నాము..!! 
సూర్యాపేటలోని ఏ గ్రామంలో సమస్యలు ఏమీ లేవని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు..!!
మేము మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాము..
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఈ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మరియు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించారా..!!
మీ గ్రామం విషయంలో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి గతంలో మేము వాటర్ ప్లాంట్ సౌకర్యాన్ని మేము కల్పించాం..!!
కల్వకుంట్ల పాలనలో మిషన్ భగీరథ పేరుతో వేలకోట్ల రూపాయలు భుజించి, గ్రామాలలో కనీసం వారానికి ఒకసారి  అయినా మంచినీరు అందిస్తున్నారా అని నిలదీయండి..!!
మేము అధికారంలో ఉన్న లేకున్నా మీ గ్రామం నన్ను ఆదరించింది, ఆశీర్వదించింది..!!
ఈరోజు రాత్రి ఈ గ్రామంలోనే బస చేసి, రేపు ఉదయం తిరిగి పాదయాత్ర కొనసాగించనున్న శ్రీ పటేల్ రమేష్ రెడ్డి బృందం..!!