Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Suryapet-Town

Wednesday, 2023-Oct-11

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 60 పైగా సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుంది టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వెల్లడి

తేది : 11_10_2023
*_సూర్యాపేట నియోజకవర్గం _*

సూర్యాపేట లో  జగదీష్ రెడ్డిని గెలవనియం!

కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి వచ్చిన కలిసికట్టుగా పనిచేస్తాం...

ఐటీ హబ్ నుంచి ఈవీఎం ను వెంటనే తొలగించాలి...

బిఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం..!!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని విమర్శించే స్థాయి కేటీఆర్, జగదీష్ రెడ్డికి లేదు...

KCR కు విస్కీలో సోడా కలిపిన జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నుండి రెండుసార్లు అదృష్టం కొద్దీ గెలిచాడు..!!

టి.పి.సి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు.

సూర్యాపేట జిల్లాలో బీసీ బందు, దళిత బందు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , గృహలక్ష్మి ఇలా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా బిఆర్ఎస్ కండువా కప్పుకున్న వాళ్లకి మరియు 30% కమిషన్ ముట్టచెప్పిన వాళ్ళాకు మాత్రమే వర్తింప చేస్తున్నారనీ, నిజమైన లబ్ధిదారులకు మొండి చెయ్యి చూపుతున్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తర్వాత ప్రభుత్వ పథకాలపై ఎంక్వయిరీ చేసి, నిజమైన లబ్ధిదారునికి  అందజేస్తామని తెలిపారు.

 సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికిచ్చినా గెలుపుకు సహకరిస్తామని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిని ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తామని, మంత్రి పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. 

గ్రామాలలోకి ఓట్ల కోసం అవినీతి బిఆర్ఎస్ నాయకులు వస్తే తరిమికొట్టాలని, కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. 

ఒకే రోజు 19 కుల సంఘాలకు హడావుడిగా శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, తొమ్మిది సంవత్సరాలు నిద్ర అవస్థలు  ఉన్న  మంత్రి జగదీశ్ రెడ్డి, నేడు ఎలక్షన్ లు సమీపిస్తున్న వేళ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేయడం షోచనీయం మంత్రి ఓటమి భయానికి పరాకాష్ట అని అన్నారు. ఈ పత్రికా సమావేశంలో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్  నాయకులు  పాల్గొన్నారు.