Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Chivvemla Mandal

Wednesday, 2023-Oct-18

చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామం నుండి బి.ఆర్.ఎస్ బిజెపి పార్టీలకు రాజీనామా చేసి 150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

తేది:18_10_2023
సూర్యాపేట నియోజకవర్గం

 కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసల పర్వం. 

 చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామం నుండి  బి.ఆర్.ఎస్ బిజెపి పార్టీలకు రాజీనామా చేసి  150 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక 
 

ఈ ప్రాంత బిడ్డను ఒక్కసారి ఆశీర్వదించండి....
పక్క నియోజకవర్గం నాయకులను తరిమికొట్టండి....
కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, నీటి ప్రాజెక్టులు....
మంత్రి జగదీష్ రెడ్డి హయాంలో అంతా అవినీతి....
దామోదర్ రెడ్డి, కాంగ్రెస్  హయాంలోనే నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు, సంక్షేమ పథకాలు అందినవి....
సంక్షేమం వైపు కాంగ్రెస్ ఉంది... అవినీతి వైపు బీ ఆర్ ఎస్ ఉంది....
ప్రజలారా ఆలోచించండి.... దూరాజ్ పల్లి గ్రామంలో నిరుపేద, అర్హులకు ఒక్కరికైన దళిత బంధు, బీసీ బంధు, గృహాలక్ష్మి వచ్చిందా....
సంక్షేమ పథకాలు అన్ని మంత్రి అనుచరులు, బీ ఆర్ ఎస్ నాయకులకేనా.....
రెండెకరాల మంత్రి 5 వేల కోట్లు ఎలా సంపాదించిండు... అది ఎవరి సొమ్ము...
కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు అందిస్తాం....
పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
ధురాజ్ పల్లి గ్రామంలో 5వ వార్డు నుండి పటాన్ సైదా ఖాన్ గారి ఆధ్వర్యంలో  బీ ఆర్ ఎస్, బీజేపీ ల నుండి కాంగ్రెస్ లో భారీగా చేరికలు

చివ్వెంల

ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డను, మీ ప్రాంతవాడిని, మీ సమస్యలపై అవగాహన ఉన్నవాడిని, మీ బిడ్డగా ఒక్కసారి నన్ను సూర్యాపేట ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి,  అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు... బుధవారం చివ్వెంల మండలంలోని దురాజ్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్, బిజెపి పార్టీ నుండి 150 కుటుంబాలకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు... తుంగతుర్తి నియోజకవర్గం నుండి మన ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులకు ఇక్కడి ప్రజలు బై బై చెప్పాలని అన్నారు... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఉపాధి,  ఇండ్లు, కాలువల ద్వారా వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా నీరు లభించాయని తెలిపారు...ఎమ్మెల్యే గా దామోదర్ రెడ్డి ఉన్నపుడు, కాంగ్రెస్ హయాంలోనే సూర్యాపేట నియోజకవర్గంలో పేదలకు ఇండ్లు, సంక్షేమ పథకాలు అందాయని అన్నారు... ప్రస్తుతం బీ ఆర్ ఎస్ అవినీతి కుంభకోణంలో మునిగిపోయి ఉందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం వైపు ఉందని అన్నారు.. సూర్యాపేట నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అన్ని మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు, బీ ఆర్ ఎస్ నాయకులకు మాత్రమే అందుతున్నాయని అన్నారు...రెండెకరాల భూమి ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి 5 వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని అన్నారు... ప్రజల సొమ్మును దోచుకున్న మంత్రి జగదీష్ రెడ్డి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలని అన్నారు... కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు...