at home
Sunday, 2023-Nov-19
తేదీ: 19-11-2023 :- ఆదివారం రాత్రి TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటేల్ రమేష్ రెడ్డి గారు తన స్వగ్రామం బాలెంల లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు..!!
సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన నేను...
మీ ఆశీర్వాదంతో MPTC, ZPTC గా ప్రస్తుతము రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగాను..!!
సూర్యాపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఆశించిన స్థాయికి ఎదిగాను..!!
దురదృష్టవశాత్తు అభ్యర్థిత్వం దక్కక పోయినప్పటికీ, అనునిత్యం మన గ్రామ మరియు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యనే ఉంటాను..!!
నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల అభీష్టం ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాను..!!
నా మీద నమ్మకం, విశ్వాసం,అభిమానం ప్రదర్శిస్తున్న మీకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను..!!
కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం విజ్ఞప్తి, హామీ మేరకు పోటీ నుండి తప్పుకున్నాను..!!
సూర్యాపేట ప్రజల మరియు దేవుడి ఆశీర్వాదంతో పార్టీలో కీలక భూమిక పోషిస్తూ మీకు సేవ చేసే అవకాశం లభిస్తుంది..!!
క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేస్తాను..!!