Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

Ralley

Friday, 2023-Nov-10

శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు

తేదీ 10 -11-2023 :- సూర్యాపేట నియోజకవర్గం నుండి.....
AIFB (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ )
పార్టీ అభ్యర్థిగా  నామినేషన్ పత్రాలను
దాఖలు చేసిన...
TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు..!!

నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు మరియు సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వత్తిడి మేరకు, ఆశేష జన సందోహం వెంట రాగా కోలాహలంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు..!!
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ...
గత 30 సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గంలో వివిధ హోదాలలో ప్రజాసేవ చేస్తున్నాను..!!

పార్టీలోని సీనియర్ల స్వార్థ బుద్ధితో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అబిష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థి ఖరారు జరిగింది..!!
నియోజకవర్గంలోనే నివాసముంటు అనునిత్యం పార్టీ కార్యకర్తల, ప్రజల
కష్టనష్టాలను కాపాడే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు కరువైంది..!!

సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు మూడు దశాబ్దాలుగా స్థానికేతర నాయకులు తిష్ట వేశారు..!!
సూర్యాపేట నియోజకవర్గ ఓటర్లు ప్రాంతీయ భేదాలకు అతీతంగా స్థానికేతరులను ఎన్నుకున్నారు..!!
ఎన్నికైన స్థానికేతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు..!!
రాజకీయ పరిణితి కలిగిన సూర్యాపేట ఓటర్లు స్థానికేతరులను తరిమి కొట్టడానికి సిద్ధమైనారు..!!

అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల నాడి ఏమాత్రం గ్రహించకుండా ప్రస్తుత ఎన్నికలలో సైతం స్థానికేతరులకు టికెట్లు కేటాయించారు..!!
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజల కోరిక మేరకు ఎన్నికలలో నేను సూర్యాపేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నాను..!!
ఉన్నత ఉద్యోగ అవకాశం వదులుకొని ప్రజాజీవతంలోకి అడుగుపెట్టిన నాకు, మీ ఆశీర్వాద బలంతో అంచలంచలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం దక్కింది..!!
ప్రస్తుత పర్యాయం నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి..!!
సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి, మీ రుణం తీర్చుకుంటాను..!!
ధన బలంతో స్థానికేతరులు సూర్యాపేట నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు..!!
చైతన్యవంతమైన సూర్యాపేట ఓటర్లు నాటి నైజాం సాయుధ పోరాట స్ఫూర్తితో...
ధన, అధికార బలం తో సూర్యాపేట నాయకులను అణగదొక్కుతున్న వారిని తరిమి తరిమి కొడదాం..!!
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల సత్తా చూపించి, అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకొని సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు..!!