డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం
Thursday, 2024-Sep-26
_తేది: - 26-09-2024_
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం
పర్యాటక అభివృద్ధి సమీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మరియు MD ప్రకాశ్ రెడ్డి గారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ...
➡️ ఖమ్మం ఖిల్లా పై రోప్ వే నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలన్నారు. రోప్ వే బ్రిడ్జి లోయర్ పాయింట్ దగ్గర పార్కింగ్ కోసం, యంత్రాల తరలింపు కోసం స్థలం విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోయర్ పాయింట్ నిర్మాణానికి లకారం చెరువు పరిసర ప్రాంతం అనువుగా ఉంటుందని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. టూరిజం హబ్ గా ఖమ్మం ఖిల్లా ను మార్చాలన్నారు. నిధులను సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. రోప్ వే తో పాటు అమ్యుస్ మెంట్ పార్కులు, హోటళ్ల నిర్మాణాలు, వాటర్ ఫాల్స్, హాళ్ళ నిర్మాణం రెండో దశలో చేపట్టాలన్నారు.
➡️ మున్సిపల్ కమిషనర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ అయోధ్య భద్రాద్రి లో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి వస్తువుల కల్పనకు కృషి చేస్తామన్నారు ఖమ్మం జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వైజ్ఞానిక యాత్రలకు శ్రీకారం చుడుతామన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్తూపం భక్త రామదాసు ధ్యాన మందిరం, కుసుమంచి శివాలయం టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ...
👉 రోప్ వే పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
👉 వాటి నిర్మాణ పనులు చేపట్టడానికి ఈ రంగములో పేరెన్నికగన్న సంస్థలను సంప్రదించడం జరిగిందన్నారు...!!