Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

బుద్ధవనం

Monday, 2024-Oct-14

బుద్ధవనం లో ఏర్పాటు చేసిన (ధమ్మ విజయం) వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు

తేది :-14-10-2024
_ నాగార్జునసాగర్ నియోజకవర్గం _

ఈ రోజు బుద్ధవనం లో ఏర్పాటు చేసిన (ధమ్మ విజయం) వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు.

ఈ సందర్భంగా శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ...

@ తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ, దేశంలోనే మరెక్కడా లేనటువంటి అద్భుతమైన బౌద్ధవారసత్వ కేంద్రంగా, నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం వద్ద ఈరోజు ధమ్మ దీక్షా వేడుకలను నిర్వహించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని అన్నారు.

@ ఆచార్య నాగార్జునుడు నడయాడిన నల్లగొండ లో జరిగిన ఈ ప్రదేశంలో, బుద్ధభగవానుని ధర్మాన్ని ఆచరించిన అశోక చక్రవర్తి 2300 సం॥ల క్రితం బౌద్ధాన్ని స్వీకరించి, యుద్ధాలు వద్దు, బౌద్ధం ముద్దని, ఇక మీదట నేనూ, నా సంతానం, ధమ్మ విజయానికే కృషితో పాటు శాసనాలను నిర్వహించి విజయదశమి రోజున భారత దేశాన్ని ధృవీకరిస్తూ, విజయదశమి రోజున ఆచార్య నాగార్జునుడు, నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్, బౌద్ధ ధర్మదీక్ష తీసుకొన్న రోజైన అక్టోబరు 14న ధమ్మదీక్ష దినంగా బుద్ధవనంలో జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొనడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది.

@ ఈ సందర్భంగా బుద్ధభగవానుని బోధనలు, అశోకుని ధమ్మ విజయ నిర్ణయం, అంబేడ్కర్ ధమ్మ దీక్ష స్వీకరణ, మనకు ఆదర్శం, ఆచరణీయం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, టూరిజం కార్పొరేషన్ MD ప్రకాష్ రెడ్డి గారు, నిజామాబాద్ ధమ్మ రక్కిత బంతే మోక్షానంద మోర్తాడ్, నాగ్వాంగ్ జుగ్నీ ప్రధాన సన్యాసి బైల్‌కుప్పే, మైసూర్, కర్ణాటక, మహాబోధి బుద్ధవిహారం, మహేంద్ర కొండలు, సికింద్రాబాద్ నుండి గినావంశ బంతే మరియు ఇతర మోకులు
తదితరులు పాల్గొన్నారు...!!