at school
Tuesday, 2024-Dec-31
_తేది :- 31-12-2024_
_సూర్యాపేట నియోజకవర్గం_
ఈరోజు సూర్యాపేట రూరల్ బాలెంల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ZPHS ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారు. మరియు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూంలో స్క్రీన్ పై ఫిజిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు వ్రాసి విద్యార్థుల నుండి సమాధానం తెలుసుకున్నారు. విద్యార్థులు డిజిటల్ క్లాస్ రూంలు, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వున్నారని అభినందనలు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు అదనపు గంటలు భోదించాలని ఉపాధ్యాయులకు సూచించారు. స్ప్రెడ్ ఇండియా సంస్ధ చైర్మన్ NRI పటేల్ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి పాఠశాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి, అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడతూ తమ స్వగ్రామమైన బాలెంలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం స్ప్రెడ్ ఇండియా ద్వారా నిధులు కేటాయించి పేద విద్యార్థులు కార్పొరేట్ స్ధాయి లో విద్యను అభ్యసించాలనే సదాశయంతో తన సోదరుడు, స్ప్రెడ్ ఇండియా చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి గారు టివి, డిజిటల్ క్లాస్ రూంలు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మినరల్ వాటర్ ప్లాంట్, స్టాఫ్ కు, విద్యార్థులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం చేశామని అన్నారు. స్ప్రెడ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామంలో విద్యార్థుల కోసం స్టడీ సెంటర్ ను నెలకొల్పి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DEO అశోక్ గారు, MEO శ్రీనివాస్ గారు, HM ప్రసాద్ గారు, ఉపాధ్యాయులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....!!