suryapet
Tuesday, 2022-Oct-25
పెన్షన్ ల కోసం రెండు కిలోమీటర్లు నడిపిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిని రేపు ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే ఐదు కిలోమీటర్లు తరిమికొట్టాలి*
పాదయాత్రకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు....*
ప్రజల సమస్యలను అడుగుతూ మనో ధైర్యాన్ని కల్పిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి....
ప్రతిపక్ష కౌన్సిలర్ లంటూ వార్డుల అభివృద్ధి చేయకపోవడం దారుణం
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు వార్డులో పాదయాత్ర ఎన్నికల కోసం కాదని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని 41,42 వార్డులలో పాదయాత్ర చేపట్టి మాట్లాడారు. పింఛన్ల తీసుకోవడం కోసం వృద్ధులను, లభిదారులను 2కిలోమీటర్లు దూరం నడిపిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే 5 కిలోమీటర్లు తరిమికొట్టాలని తెలిపారు. 8సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గాన్ని పాలిస్తున్న రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేసిందో చూపించాలని సవాల్ విసిరారు. దసరాకు మురికి కాలు తీస్తే దీపావలి కి తీస్తున్నారని దీపావళికి తీస్తే తిరిగి సంక్రాంతికి తి స్తున్నారని ఆరోపించారు. కాలువలు తీసిన చోట చెట్లు మొలిసాయ తప్ప చెత్త తీయడం లేదన్నారు. సూర్యాపేట పట్టణంలో కనీసం ఇడ్లి బండి తోసుకొని పోయి వ్యాపారం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.ప్రతి పక్ష కౌన్సిలర్ అనే కారణంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డులలో అభివృద్ధి చేయడం లేదు. పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో 25వేల ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో 3 ఇందిరమ్మ కాలనీ విడుదల్లో 3వేల ఇండ్లు పంచిన ఘనత కాంగ్రెస్ అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి 15 వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 192 ఇండ్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడని అన్నారు. జిల్లా కేంద్రంలోని కనకదుర్గమ్మ దేవాలయంలో పూజలు చేశారు.