Pier Goodman
PARTY SECRETERY
Do you face issue campaign
15%
Is candidate perfect for you
75%
Is candidate have any claim
05%
I have no comments
35%

Event Details

suryapet town

Saturday, 2022-Dec-03

# తెలంగాణ ప్రతిష్టను దేశస్థాయిలో దిగజారుస్తున్న సీఎం కేసీఆర్ #

తేదీ 03-12-2022 శనివారం
తెలంగాణ ప్రతిష్టను దేశస్థాయిలో దిగజారుస్తున్న సీఎం కేసీఆర్*=======


పంజాబ్ లో సీఎం ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడం సిగ్గుచేటు======


కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో దొరకడం పై సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెప్తాడు======


మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నాతో పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి=======

రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ మాత్రమే అన్నారు*

ప్రజల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర=====


14వ రోజు చేరిన కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర=======


145 కిలోమీటర్ల చేరుకున్న పాదయాత్ర ప్రజల నుండి విశేష స్పందన========


సూర్యాపేట *పంజాబ్లో రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం సిగ్గుచేటని, తెలంగాణ ప్రతిష్టను దేశంలో దిగజారుస్తున్నాడని *టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి*అన్నారు.  శనివారం జిల్లా కేంద్రంలోని 21వ వార్డు శ్రీలత, జీవనజ్యోతి గార్ల ఆధ్వర్యంలో వార్డు వార్డుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో 100 కోట్ల స్కామ్ చేసినట్టు సిబిఐ నోటీసులు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం  దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు ను తీసుకున్నారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటు కుటుంబాన్ని అటు రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నాడని ఆరోపించారు. రాజకీయం కోసం కాదని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాటిని పరిష్కరించడానికి వార్డువార్డుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో పశువుల దొడ్ల కన్నా హీనంగా, అధ్వానంగా వార్డులు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు .జిల్లా కేంద్రంలో నడిబొడ్డులో ఉన్న పుల్లారెడ్డి చెరువు డంపింగ్ యార్డ్ గా మారిందని చెత్తాచెదారాలు పేరుకుపోయి ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రజల ఆశలు ఆవిరి చేస్తూ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే భోగాల అనుభవిస్తుందని ఆరోపించారు .మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి దమ్ముంటే జిల్లా కేంద్రంలో ఉన్న ఏ వార్డుకైన నాతో పాటు పాదయాత్ర చేయాలని ప్రజల సమస్యలను వినాలని సవాల్ విసిరారు .కావాలనే ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులో నిధులు కేటాయించకుండా అభివృద్ధిని దూరం చేస్తున్నాడని విమర్శించారు .ఏ ఒక్కరికి అధికారం శాశ్వతం కాదని త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దేశంలో రాష్ట్రంలో ప్రపంచమే చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల్లో మురుగునీరు ప్రవహించడం లేదని, చెత్త పేరుకుపోయిందని వారానికి ఒకసారి కూడా మంచినీరు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు .పేద ప్రజలు టిఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు ధరలను అదుపు చేయడంలో టిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు .