suryapet town
Friday, 2022-Dec-02
02-12-2022 శుక్రవారం
ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ ,డీజిల్ ,నిత్యవసర సరుకుల ధరలు*
పెట్రోల్ డీజిల్ ధరల పేరుతో పేదవాళ్లపై 25 లక్షల కోట్ల భారం మోపుతున్న బిజెపి,టిఆర్ఎస్*=========
70 నుండి 80 శాతం పేద ప్రజలకు ఇండ్లు లేక కిరాయిలలో నివసిస్తున్నారు*======
టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలతో పేదలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు*=========
మురుగు కాలువలు తీయక దోమలు పెరిగిపోతూ ఉన్నాయి==========
రోగులతో నిండిపోతున్న ప్రైవేట్ ఆస్పత్రులు=====.
13వ రోజు చేరిన కాంగ్రెస్ పార్టీ వార్డు వార్డుకు పాదయాత్ర*======
135 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర======
పటేల్ రమేష్ రెడ్డి పాదయాత్రకు జన నీరాజనం=======
సూర్యాపేట టౌన్ *
టిఆర్ఎస్,బిజెపి పాలనలో పెట్రోల్ మరియు డీజిల్ నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి*అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 33 వార్డులో దండు అరవింద్ రెడ్డి, గణేష్, చిలుముళ్ల గోపాల రెడ్డి, 44 వార్డులో పాలవరపు వేణు,గట్టు శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో వార్డు వార్డుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు పేదలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ముమ్మాటికి టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలతో పేదలకు న్యాయం జరగదు అన్నారు. కాంగ్రెస్ పాలనలో గతంలో పెట్రోల్ లీటర్ 70 రూపాయలు ఉండగా ప్రస్తుతం 110 కి చేరిందని గతంలో డిజిల్ లీటర్ కు 60 ఉండగా బిజెపి,టిఆర్ఎస్ పాలనలో ప్రస్తుతం 100 రూపాయల చేరిందని తెలిపారు. బిజెపి టీఆర్ఎస్ ఒక్క పెట్రోల్ డీజిల్ పేరు మీదనే 25 లక్షల కోట్ల భారం పేదలపై మోపుతున్నాయని మండిపడ్డారు. ఇందులో కేంద్ర వాటా 35 రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం వాటా 35 రూపాయలు కాగా 70 రూపాయలు లీటర్ మీదనే వసూలు చేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఏ వార్డు చూసినా చెత్తాచెదారాలు పేరుకు పోతున్నాయని కనీసం మురుగునీరు తీసే పరిస్థితి లేదని మురుగునీరు ప్రవహించక దోమలు వృద్ధి చెంది పట్టణ ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు రోగాలపై చికిత్సలు తీసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని హటకెక్కించిందని తెలిపారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో 25వేల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సూర్యాపేట నియోజవర్గంలో కేవలం 192లో ఇచ్చిందని ఆరోపించారు. పింఛన్లు కొత్త రేషన్ కార్డులు ఏ ఒక్కరికి రావడం లేదని తెలిపారు ఇంట్లో ఒక్కరికి మాత్రమే పింఛన్ ఇచ్చి మరొకరికి ఇవ్వకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మాయ చేసిందని మండిపడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా అగ్గిపెట్టకు, కోడిగుడ్ల కూడా ధరల రెక్కలు వచ్చాయని తెలిపారు. నిజాం పాలనను తలపిస్తున్న టిఆర్ఎస్ పాలనను ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారని తెలిపారు. త్వరలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేద ప్రజల కష్టాలను తీర్చేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని తెలిపారు